CLICK ME

Sunday 18 December 2016

మాలతి మలర్ – Part 21

సాయంతరం ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతుంటే మధ్యలో మాలతి ఫోన్.బైక్ నడుపుతూనే మాట్లాడాను.
“చెప్పు మాలతి”
” శివా!” తన గొంతులో ఏదో ఆందోళన కనబడుతుంది.
“ఏమైంది మాలతి?”
అంతే,బోరుమని ఏడుస్తూ “ఆయనకు ఆక్సిడెంట్”
అదిరిపడ్డాను.బైక్ ఆపాను.వివరాలు కనుక్కొని వెంటనే హాస్పిటల్ వెళ్ళాను.అప్పుడు సమయం రాత్రి 8 అయ్యింది.మాలతి చెప్పిన గది బయట,కౌసి ఏడుస్తూ కనబడింది.నన్ను చూడగానే నా చెయ్యి పట్టుకుని విలపించింది. నేను ఓదార్పుగా తన తల నిమిరుతూ,,
“అమ్మ ఏది ?” అడిగాను.
తను నా చెయ్యి పట్టుకుని ప్రక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది.మంచం ప్రక్కన స్టూల్ మీద మాలతి శోకదేవతలా కూర్చుని ఉంది. మొహం ఉబ్బిపోయి,ఏడ్చి ఏడ్చి కళ్లు వాచిపోయి ఉన్నాయి.నా గుండె చెరువు అయ్యింది.పక్కన మంచం మీద మాలతి భర్త మత్తులో ఉన్నారు.మొహం మీద చిన్న చిన్న దెబ్బలు.కాలుకు పెద్ద కట్టు ఉంది.నన్ను చూడగానే,మాలతి లేచి నిలబడి
“రా శివా” దుఃఖము దిగమింగుకుంటూ అంది.
” ఎలా జరిగింది? అడిగాను.
“ఆఫీస్ నుండి వస్తూ,ఒక వాన్ ను ఢీ కొన్నారట,రోడ్డు ప్రక్కన పడి ఉంటే,చూసిన జనాలలో ఒకరు ఆయన మొబైల్ ఉన్న ఒక ఫ్రెండు నెంబరుకు కాల్ చేసి చెబితే తను ఈయన్ని ఇక్కడకు తీసుకొచ్చారు”
“డాక్టరు ఏమన్నారు”?
ఏడుపును అదుపులోకి తెచ్చుకుంటూ” బయపడడానికి ఏమి లేదు,కాలు ఫ్రాక్చర్ అయ్యింది.కోలుకోడానికి మూడు ,నాలుగు నెలలు పట్టవచ్చు అన్నారు”
“మీ బంధువులుకు తెలియపరిచావా?”
“మ్మ్….అత్తయ్య,మామగారు,ఆడపడుచు వస్తున్నారు….ఇలా అవుతుందని నేను కలలోకూడా ఊహించలేను.చాలా భయంగా ఉంది శివా”
“ఏయ్ ఏంటి ఇది, చిన్న పిల్లలా? డాక్టరు కంగారుపడనవసరం లేదని చెప్పారుగా…సరే, ఏమన్నా తిన్నరా?”
“ఇప్పుడేమి తినబుద్ది కావడం లేదు..వద్దు”
“నీకేమన్నా మతిపోయిందా?ఇప్పుడేమైందని? అన్ని సర్ధుకుంటాయి నిదానంగా.పిల్లల ముఖం చూడు, ఎలా బిక్కచచ్చిపోయున్నారో?” అంటూ ఇక తన మాట వినకుండా ప్రక్కనే ఉన్న ఒక హోటల్ లో మూడు టిఫిన్ ప్యాకెట్లు తీసుకుని హాస్పెటల్ చేరెటప్పటికి,మాలతి అత్తగారు,మామయ్యగారు గదిలో మాట్లాడుతూ ఉన్నారు.వాళ్లను పలకరించి ప్యాకెట్లు మాలతికి ఇచ్చి ఇక బయలుదేరుతానని చెప్పాను.తను ముభావంగా బయటిదాకా వచ్చి సాగనంపింది.గుండె భారంతో ఇంటికి చేరుకున్నాను.
వారం రోజుల తర్వాత,ఆయన డిశ్చార్జ్ అయ్యారు.ఈ వారం రోజులు వీలయినప్పుడల్లా హాస్పిటల్ కు వెళ్లి ఆయనను పలకరించేవాడిని.ఆయన కూడా బాగానే మాట్లాడేవారు.బాగనే కోలుకున్నారు కాని,కాలు మాత్రం సర్దుకోడానికి కనీసం మూడు నెలలు పట్టోచ్చు అంటున్నారు.అప్పుడప్పుడు మాలతికి ఫోన్ చేసి ఆయన బాగోగులు కనుక్కునే వాడిని.ఇంటికి వెళ్లి పరామిర్శించేవాడిని.మాలతి ఇంటి పనులు బయటి పనులతో సతమతం అవుతుండేది.తన మొహం మీద చిరునవ్వు చూసి చాలా కాలమయింది.రెండు వారాల తర్వాత తన ఆడపడుచు వెళ్ళిపోయింది.మాలతి తో మనసు విప్పి మాట్లాడి చాలా కాలమయ్యింది.తనూ స్కూల్ కు వెళ్ళడం మొదలుపెట్టింది.
ఒకరోజు మాలతిని చూడాలని,సింధును క్లాసు రూం లో వదలి గేటు దగ్గర నిలబడ్డాను,ఇంతలో మాలతి వచ్చింది.ముఖం లో కళలేదు.నన్ను చూసి పేలవంగా నవ్వింది.
“ఎంత సేపయ్యింది శివా?… వచ్చి”
“ఇప్పుడే.. బాగున్నవా?”
“ఏదో ఉన్నాను”.
“ఆయన ఎలా ఉన్నారు?”
“పర్వాలేదు,కాని రెండు నెలలదాకా ఆయన నడవలేరు”,గొంతు గాద్గికంగా ఉంది.కంట్లో నీరు.
“మాలతి ప్లీజ్…కంట్రోల్ యువర్ సెల్ఫ్ ”
“మ్మ్…..”కళ్ళు తుడుచుకుంటూ నన్ను చూసింది.
“నువ్వెలా ఉన్నావు శివా?”
“బాగానే ఉన్నాను.మనసు బాగోలేదు అందుకే నిన్ను చూడాలని వచ్చాను”
“మ్మ్….”
“సారి…నీకిన్ని కష్టాలు వస్తాయని అనుకోలేదు మాలతి”
“నేను చేసిన పాపానికి ఆయన ఫలితం అనుభవిస్తున్నారు” (పెద్ద నిట్టూర్పు )
“నో మాలతి.నీవేమి చేశావు?అలాంటిదేమి లేదు”
“లేదు శివా,నాకు తెలుసు.ఇదంతా నా పాప ఫలితమే.పాపం ఆయనకు శిక్ష పడింది”
“వ్వాట్? నువ్వేమి చెశావు?
చెమర్చిన కళ్ళతో నన్ను చూస్తూ “శివా,నా ముఖం చూసి చెప్పు,నీకేమి తెలియదా?నేనేమి పాపం చెయ్యలేదా?” సూటిగా అడిగింది.
“నో..ఇప్పుడు జరిగిన దానికి,మనం చేస్తున్నదానికి సంబంధమే లేదు.గజిబిజి ఆలోచనలతో నీ మనస్సు పాడుచేసుకోకు.”
“మ్మ్….”
కొంచం సేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.తను కళ్ళు తుడుచుకొని”సరే శివా,ఇక నేను వెళతాను.క్లాసుకు టైం అయ్యింది”అంటూ కదలింది.
నేనూ బై చెప్పి,బయటకు వచ్చి బైక్ తీస్తూ వెనక్కి తిరిగి చూశాను,తను కూడా చూస్తాదేమోననే ఆశతో.కాని తను ఏమీ జరగనట్టే క్లాసు రూం లోకి వెళ్ళిపోయింది.కొండంత భారమైన మనస్సుతో ఆఫీసులోకి వచ్చి పడ్డాను.
సాయంత్రం ఇంటికి వచ్చానే కాని,మనస్సు మనస్సులో లేదు.భోజనం సహించలేదు.మనస్సంతా మాలతి.నిద్రరావడంలేదు.చాలా కాలం తర్వాత,అర్ధరాత్రి మాలతికు మెసేజ్ పెట్టాను. (ఇంకా ఉంది)

No comments:

Post a Comment